
తాము అధికారంలోకి వచ్చాక 55 వేల 163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతేనే కాంగ్రెస్ కు ఓటెయ్యాలన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ సభలో మాట్లాడిన రేవంత్..కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని ఆరోపించారు. అభ్యర్థి దొరక్కనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్ కామెంట్స్
- 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై చర్చ జరగాలి
- కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి
- బీఆర్ఎస్ తో తెలంగాణకు సంబంధం లేదని ప్రజలు ఓటుతో తీర్పు ఇచ్చారు.
- ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థే దొరకలేదు
- కాంగ్రెస్ ఓటమి కోసం బీజేపీ ప్రచారంచేస్తుంది
- ఎంపీ,అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు
- బీఆర్ఎస్ ఓడిపోయినా కాంగ్రెస్ పై కుట్రచేస్తున్నారు
- తెలంగాణ సాధనలో పట్టభద్రులు భాగ స్వాములయ్యారు
- రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హత బీఆర్ఎస్ కు ఉందా?
- కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పదేల్లలో ఏం చేసిందో చెప్పాలి
- మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 55163 ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇవ్వకపోతే
- ఉద్యోగాలు నిజమైతేనే మాకు ఓటెయ్యండి
- రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ జరిగితేనే మాకు ఓటెయ్యండి
- రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడితేనే మాకు ఓటెయ్యండి
- బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు వచ్చాయా?
- బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు
- నిరుద్యోగులకు స్కిల్ డెవ్ లప్ మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాం
- టాటాకంపెనీతో ఒప్పందం నిజమైతే మాకు ఓటెయ్యాండి
- స్టేట్ లో 65 ఐటీఐలను అప్ గ్రేడ్ చేశాం
- పదేళ్ల తర్వాత టీచర్ల బదిలీలు.. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం
- నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం
- మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చాం
- గ్రామీణ ప్రాంతాల్లో యువత నైపుణ్యాన్ని గుర్తించి శిక్షణ ఇస్తున్నాం
- నిజామాబాద్ రైతులంటేనే దేశానికి తలమానికం
- ఇందూరు రైతుల పోరాట స్ఫూర్తి అద్భుతం
- సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తేనే మాకు ఓటెయ్యండి
- కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు
- రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు
- రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారు.
- వందేండ్ల కులగణన సమస్యను పరిష్కరించా
- కాంగ్రెస్ అధికారంలో ఫస్ట్ తారీఖునే ఉద్యోగాలకు జీతాలు
- బండి సంజయ్..2021లో కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలి
- కులగణన తప్పైతే ఎక్కడ తప్పో బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలి