మోదీకి గులాంలుగా షిండే, అజిత్, చవాన్: సీఎం రేవంత్ రెడ్డి

మోదీకి గులాంలుగా  షిండే, అజిత్, చవాన్: సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు హైదరాబాద్​కు వస్తే సెక్రటేరియెట్​లో కూర్చోబెట్టి గ్యారంటీల అమలుపై వివరిస్తానని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమాపణలు కూడా చెప్తానని తెలిపారు. ‘‘లేదంటే కేంద్ర మంత్రి, కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిటీ వేసి తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపండి. వాళ్లకు అన్ని వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాలు ఇస్తం. అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైతే వారి విమాన ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్చులు మేమే భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిస్తం” అని సవాల్​ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పుణెలో మీడియాతో మాట్లాడారు.

ముంబై దేశానికి ఆర్థిక రాజ‌‌‌‌ధాని అని, మ‌‌‌‌హారాష్ట్ర రాజ‌‌‌‌కీయంగా దేశంలో రెండో పెద్ద రాష్ట్రమని, అలాంటి రాష్ట్రాన్ని మోదీ కోవ‌‌‌‌ర్టు ఆప‌‌‌‌రేష‌‌‌‌న్లకు, విద్రోహులకు అడ్డాగా మార్చారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. చిన్న కార్యక‌‌‌‌ర్త షిండేను బాలాసాహెబ్ ఠాక్రే మంత్రి వ‌‌‌‌ర‌‌‌‌కు తీసుకువ‌‌‌‌స్తే..  ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా, మోదీకి గులాంగా షిండే మారారని విమర్శించారు. శ‌‌‌‌ర‌‌‌‌ద్ పవార్ సొంత బిడ్డను కాద‌‌‌‌ని సోద‌‌‌‌రుడి కుమారుడు అజిత్ ప‌‌‌‌వార్‌‌‌‌కు మంత్రి ప‌‌‌‌ద‌‌‌‌వులు ఇస్తే ఆయ‌‌‌‌న‌‌‌‌ మోదీ పంచన చేరారని అన్నారు. 

అశోక్ చ‌‌‌‌వాన్‌‌‌‌ను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేస్తే..ఆయ‌‌‌‌న కూడా మోదీకి గులాంగా మారారని రేవంత్ దుయ్యబట్టారు. ముంబైలోని ధారావిని క‌‌‌‌బ్జా చేసేందుకు విద్రోహులైన షిండే, అజిత్ ప‌‌‌‌వార్, అశోక్ చ‌‌‌‌వాన్‌‌‌‌ను వినియోగించు కుంటున్నారని ఆరోపించారు.‘‘12 కోట్ల మ‌‌‌‌హారాష్ట్ర ప్రజలకు నేను ఒక‌‌‌‌టే విజ్ఞప్తి చేస్తున్నా.. ఇది ఎన్నిక కాదు.. ఇదో ధర్మ యుద్ధం.. గుజ‌‌‌‌రాత్‌‌‌‌కు చెందిన  ఇద్దరు మ‌‌‌‌హారాష్ట్రను దోచుకునేందుకు ప్రయ‌‌‌‌త్ని స్తున్నారు.మ‌‌‌‌హారాష్ట్ర  ప్రజ‌‌‌‌లు ఆలోచించి ఈ ఎన్నిక‌‌‌‌ల్లో మ‌‌‌‌హా వికాస్ అఘాడీకి (ఎంవీఏ) ఓటు వేయాలి’’అని కోరారు. మ‌‌‌‌హారాష్ట్రలో ఎంవీఏను గెలిపిస్తే తెలంగాణ‌‌‌‌లో అమ‌‌‌‌ల‌‌‌‌వుతున్న అన్ని హామీలు ఈ రాష్ట్రంలో అమ‌‌‌‌ల‌‌‌‌వుతాయని చెప్పారు.