ఏం చింతపడకు హరీశ్​రావు.. నీ లెక్క తేలుస్తా:సీఎం రేవంత్

తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. పదేండ్లలో కేసీఆర్ ఏం వెలగబెట్టారని  ప్రశ్నించారు. పదేండ్లు ప్రభుత్వం నడిపినోడు పది నెలలు కాకముందే తమను దిగిపో అంటున్నారని మండిపడ్డారు.

హరీశ్​ రావు లెక్క తేలుస్తాం.. 

రంగనాయకసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టుకున్నారని, భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని తన పేరు మీదకు రాయించుకున్నారని రేవంత్ అన్నారు. ‘‘తన ఫామ్ హౌస్ కు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలట. అందుకే రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను ప్రాజెక్టు నుంచి తొలగించి హరీశ్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నడు. దానికి హరీశ్ రావు లెక్క జెప్పాల్సిందే. ఏం చింతపడకు హరీశ్​రావు.. నీ లెక్క చెప్తా .. అన్ని లెక్కలు తీయిస్తున్నాం” అని అన్నారు. ‘‘కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వలు తీయడానికి. వేల కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి  ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తావా..? ఇది న్యాయమా కేసీఆర్?” అని ప్రశ్నించారు.