
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం, ఆదాయం ఉంటేనే పనిచేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో పదేళ్లు తామే అధికారంలో ఉంటాం....కేసీఆర్ పదేళ్లు ఫామ్ హౌజ్ లోనే ఉంటారు..ఆ తర్వాత ఆయన చరిత్ర అక్కడే పరిసమాప్తం అవుతుందని ధ్వజమెత్తారు రేవంత్. కేసీఆర్ మాటల్లో, కళ్లలో విషం కనిపిస్తోందన్నారు. ప్రతిపక్షపాత్ర పోషించకుండా తమను ప్రశ్నించే అర్హత లేదన్నారు రేవంత్. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌజ్ లోనే ఉంటూ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే పదేళ్లు అధికారం అనుభవించి..ఇపుడు విలన్ అంటారా అని కేసీఆర్ ప్రశ్నించారు రేవంత్.
రేవంత్ కీలక కామెంట్స్
- బీఆర్ఎస్ సభకు ఎన్ని బస్సులు అడిగినా ఇవ్వాలని చెప్పినా
- ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి
- కేసీఆర్ సభలో ఒక్క ప్రజాసమస్యను అయినా ప్రస్తావించారా
- 65 లక్షల జీతం తీసుకున్నరు బంగ్లా తీసుకున్నరు
- ప్రతిపక్ష నేత పాత్ర ఎందుకు పోషించడం లేదు
- సభకు రాని నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు.?
- ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఫామ్ హౌజ్ లో ఎందుకున్నరు.?
- సభకు రాని నీకు ప్రశ్నించే అర్హత ఎక్కడిది.?
- మీరు ప్రవేశ పెట్టిన ఏ పథకం మా ప్రభుత్వంలో ఆగిపోయింది
- ఫాంహౌజ్ లో పండుకుని ఏం సందేశం ఇస్తున్నరు.?
- అధికారం ఆదాయం ఉంటేనే పనిచేస్తారా.?
- ఆర్టీసీ బస్సుల్లో ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం
- పదేళ్లు మేమే అధికారంలో ఉంటాం..నువ్వు ఫాంహౌజ్ లోనే ఉండు
- అక్కడే నీ రాజకీయ చరిత్ర సమాధి అవుతుంది
- దేనిపైనా అయినా చర్చకు సిద్ధం..చర్చకు రా కేసీఆర్.
- కేసీఆర్ మాటల్లో విషం కనిపిస్తుంది
- ఆయన చూపుకు బలమే ఉంటే..మేం ఇపుడు ఇక్కడ ఉండేవాళ్ల కాదు
- కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ మీద పడి దోచుకున్నది నిజం కాదా?
- కాంగ్రెస్ ఏ విధంగా విలన్ అయితది
- తెలంగాణ ఇచ్చినందుక విలనా?
- కేసీఆర్ తన ప్రసంగంలో నా పేరు ఎక్కడా ప్రస్తావించే ధైర్యం చేయలేదు
- మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా..మీ ఇంట్లో వాళ్లకు పదవులు ఇవ్వలేదా?
- నేటి తరానికి బసవేశ్వరుడు ఒక స్ఫూర్తి
- బసవేశ్వరుడు సంఘసంస్కర్త
- సామాజిక వివక్షకు వ్యతిరేకంగా బసవేశ్వరుడు పోరాడారు
- విప్లవకారుడు అంటే తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదు
- విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడే
- ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం పనిచేస్తున్నాం
- రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నాం
- మా ప్రజాప్రతినిధులందరూ బాధ్యతతో పనిచేస్తున్నారు
- బీఆర్ఎస్ సభకు పూర్తిగా సహకరించాం
►ALSO READ | జాతీయ భద్రతా సలహాబోర్డు చైర్మన్గా మాజీ రా చీఫ్ అలోక్ జోషి