ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసి తీరామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ పై హరీష్ రావు చేసిన సవాల్ కు కట్టుబడి లేడు. హరీష్ రావు దొంగ.. రాజీనామా చేయకుండా పారిపోయారని విమర్శించారు. ఓడిపోయిన దొంగ హరీష్ రావు అని అన్నారు రేవంత్ . రుణమాఫీ కాలేదంటే కేటీఆర్ హరీష్ రావు గ్రామాలు తిరగాలన్నారు రేవంత్.రాష్ట్రంలో అన్ని గ్రామాలు తిరిగి రైతుల ఖాతాలను లిస్టు తయారుచేసి కలెక్టర్లకి ఇవ్వాలన్నారు కేటీఆర్ కొడంగల్ కు వెళ్తానంటనే స్వాగతిస్తానని చెప్పారు. కేటీఆర్ కొడంగల్ కు వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడాలన్నారు. కేటీఆర్ ను వాళ్ల తండ్రి కేసీఆరే నమ్మరన్నారు రేవంత్.
మేము ఎవరిని భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం లేదన్నారు రేవంత్. తమకు కావలసినంత బలం ఉందన్నారు. చెరువులపై హరీష్ రావుకు మంచి అవగాహన ఉంది అందుకే ఆయన హయాంలో కమిషన్ కాకతీయ వచ్చిందన్నారు. చెరువుల కబ్జాలపై నిజనిర్ధారణ కమిటీ వేసి హరీష్ రావును ముందు పెడదాం. ఎవరి కబ్జాలు ఏంటో అప్పుడు తేలుతుందన్నారు.
ALSO READ | ఎంత పెద్ద వాళ్లైనా వదలం.. ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గం: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఆయన బయటకు రావాలి ప్రజల కోసం పోరాటం చేయాలన్నారు రేవంత్. కేసీఆర్ కి ప్రతిపక్ష నాయకుడి హోదాలో జీతాలు ఇస్తున్నామని చెప్పారు రేవంత్. జీతం తీసుకుంటున్నందుకైనా కేసీఆర్ ప్రజల్లో తిరగాలన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రజల కోసం పనిచేయకపోతే ఎలా? అని ప్రశ్నించారు.
వాల్మీకి స్కేమ్ తో మాకు సంబంధం లేదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఖాతాలు ఉన్నంత మాత్రాన తమకు సంబంధం ఉంటుందా? అని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్ లో బీఆర్ఎస్ నేతలేకే లింకులు ఉండొచ్చన్నారు. డ్రగ్స్ కోసం కొంతమంది బీఆర్ఎస్ నేతలు బెంగుళూరు వెళ్లడం అందరికీ తెలిసిందేనన్నారు. పార్టీలో చేరేవారు మా పాలన నచ్చి చేరుతున్నారు.
రెండు రాష్ట్రాల చిక్కుముడులు రేవంత్ రెడ్డి వచ్చాకే చాలావరకు పరిష్కారం అయ్యాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. జనాభా ప్రాతిపదికన అప్పుల పంపకంపై రేవంత్ వచ్చాకే ఏపీ..తెలంగాణ మాట వింటుందన్నారు.