హైదరాబాద్ లో దివంగత నేత, తెలంగాణ మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోశయ్య వర్ధంతి సభలో మాట్లాడిన రేవంత్.. రోశయ్య ఆర్థిక సామర్థ్యంతోనే తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి..ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలని రోశయ్య సూచించారని చెప్పారు.
ట్రబుల్ షూటర్ గా రోశయ్య కీలక పాత్ర పోషించారు కాబట్టే..వైఎస్సార్ పని ఈజీ అయ్యిందన్నారు సీఎం రేవంత్. 16 ఏళ్లు రోశయ్య ఆర్థిక మంత్రిగా పనిచేశారని చెప్పారు రేవంత్ . సీఎంలు ఎవరున్నా..నంబర్ 2గా రోశయ్యే ఉండేవారన్నారు. రోశయ్య ఎప్పుడూ పైనున్న వారిని దాటాలనుకోలేదన్నారు. మండలిలో రోశయ్యను ఎదురించి మాట్లాడేవాడిని .. ఆయన తన చాంబర్ కు పిలిచి సలహాలు,సూచనలు ఇచ్చేవారని చెప్పారు రేవంత్.
Also Read :- తెలంగాణలో మళ్లీ భూకంపం వస్తుందా.?
హైదరాబాద్ లో రోశయ్య విగ్రహం లేకపోవడం పెద్దలోటన్నారు సీఎం రేవంత్... రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రోశయ్య తనకు పదవి కావాలని ఏనాడు అడగలేదన్నారు.రాష్ట్రం ఆర్థికంగా రాణించాలంటే ఆర్య వైశ్యుల పాత్ర కీలకమన్నారు రేవంత్. రోశయ్య అందరికీ స్ఫూర్తి అని .. ఆయన ప్రతిభ, క్రమశిక్షణే ఆయనకు అంత పెద్ద హోదా తెచ్చిపెట్టాయన్నారు ..ఇప్పుడు చట్టసభల్లో అలాంటి వాతావరణం లేదన్నారు రేవంత్ .