‘పాలమూరు’ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సర్కారు ఫోకస్‌‌‌‌‌‌‌‌.. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పనులు పునరుద్ధరించేందుకు కసరత్తు

‘పాలమూరు’ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సర్కారు ఫోకస్‌‌‌‌‌‌‌‌.. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పనులు పునరుద్ధరించేందుకు కసరత్తు
  • ఇంజినీర్లు, ఎమ్మెల్యేలతో పలుమార్లు రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • రేపు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను సందర్శించనున్న రాష్ట్ర మంత్రులు
  • ఏడాదిగా నిలిచిన పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ పనులు

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ స్కీం (పీఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఐ)పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో గత ఎన్నికలకు ముందు నిలిచిపోయిన ఈ పనులను తిరిగి స్టార్ట్ చేసేందుకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌ పనులపై ఇప్పటికే ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల నుంచి ఇప్పటికే రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ తెప్పించుకొని పలుమార్లు రివ్యూలు సైతం నిర్వహించింది.

ఈ పనులు పూర్తి చేసేందుకు ఎస్టిమేషన్లు తీసుకుంది. స్కీమ్‌‌‌‌‌‌‌‌లో భాగమైన ఉదండాపూర్, కర్వెన, వట్టెం, ఏదుల, నార్లాపూర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్లను బుధవారం రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించనుంది. అక్కడ చేపట్టాల్సిన పనులపై సర్కార్‌‌‌‌‌‌‌‌కు నివేదిక ఇవ్వనుంది.

ఏడాదిగా నిలిచిన పనులు

పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం 2015 జూన్‌‌‌‌‌‌‌‌ 11న ప్రారంభించింది. మూడేండ్లలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి కేవలం 55 శాతమే కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేసింది. కాంట్రాక్టర్లకు రూ. కోట్లలో బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టడంతో ఆ సంస్థలు 2023 సెప్టెంబరు నుంచి పనులను పూర్తిగా నిలిపివేశాయి.

పని ప్రదేశాల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, ఆఫీసులను సైతం తరలించుకుపోయాయి. కొన్ని టిప్పర్లను మాత్రమే అక్కడ ఉంచి పెద్ద, పెద్ద మెషీన్లను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాయి.

పనుల పునరుద్ధరణకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కసరత్తు

ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పెండింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పాలమూరు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌పై సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఏఏ పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి ? భూ సేకరణ ఎంత మిగిలి ఉంది ? నిర్వాసితులకు ఇంకా ఎంత పరిహారం చెల్లించాలి ? ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తికి ఎన్ని నిధులు కావాలి ? అనే విషయాలపై చర్చించింది.

ఆగిపోయిన పనులను తిరిగి స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పీఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఐలో కీలకమైన ఉదండాపూర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను బుధవారం మంత్రులు విజిట్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. తర్వాత మిగతా రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తారు.

ప్రస్తుత పరిస్థితి ఇదీ..

పీఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఐ కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా.. లక్ష్మీదేవిపల్లిని పూర్తిగా పక్కకు పెట్టేశారు. మిగిలిన ఐదు రిజర్వాయర్లలో ఏదుల పనులు దాదాపు 90 శాతం పూర్తి చేయగా, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టింది. ఎన్నికలకు నెల రోజుల ముందు కేసీఆర్ నార్లాపూర్ వద్ద పంపులను ఆన్‌‌‌‌‌‌‌‌ చేసినప్పటికీ పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో మరుసటి రోజే పంప్‌‌‌‌‌‌‌‌లను బంద్ చేయాల్సి వచ్చింది. నార్లాపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఏదులకు ఏర్పాటు చేసిన మెయిన్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

వట్టెం మెయిన్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌, రిజర్వాయర్, పంప్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌, వట్టెం–-కర్వెన మెయిన్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ పనులు పెండింగ్‌ ఉన్నాయి. కర్వెన నుంచి ఉదండాపూర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ వరకు 18 కిలోమీటర్ల మేర అండర్‌‌‌‌‌‌‌‌ టన్నెల్‌‌‌‌‌‌‌‌ పనులు చేయాల్సి ఉండగా, కొంత దూరమే పూర్తయింది. ఉదండాపూర్‌‌‌‌‌‌‌‌ కింద 16వ ప్యాకేజీలో పంప్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 17, 18వ ప్యాకేజీలో ఇప్పటివరకు కట్ట పనులు 25 శాతమే పూర్తి కాగా, 18వ ప్యాకేజీలో పనులు చేయాల్సి ఉంది. ఇదే ప్యాకేజీలో మెయిన్‌‌‌‌‌‌‌‌ కెనాల్స్‌‌‌‌‌‌‌‌ పనులు కూడా ఆగిపోయాయి. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ కింద కొందరు రైతుల నుంచి 200 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. వీరు భూ సేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం ఇవ్వాలని 2018లో కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి భూ సేకరణ ఆగిపోయింది. 

నెల రోజుల పాటు డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పీఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఐ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో భాగమైన వట్టెం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లోకి భారీ మొత్తంలో వరద చేరింది. ఆగస్టు 31, సెప్టెంబరు 1, 2 తేదీల్లో మెయిన్‌‌‌‌‌‌‌‌ టన్నెల్‌‌‌‌‌‌‌‌ నుంచి వర్షపు నీరు పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లోకి చేరింది. దీంతో నాలుగు పంపులు నీటిలో మునిగిపోయాయి. 5వ పంప్‌‌‌‌‌‌‌‌ సగం వరకు మునిగింది.

ఇవి కాకుండా స్పేర్‌‌‌‌‌‌‌‌ పార్ట్స్‌‌‌‌‌‌‌‌, గ్రీస్, ఆయిల్‌‌‌‌‌‌‌‌తో పాటు సుమారు రూ. వెయ్యి కోట్ల సామగ్రి నీటిలో మునిగిపోయింది. 150 హార్స్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ఉన్న నాలుగు మోటార్లను ఏర్పాటు చేసి వారం రోజుల నుంచి నీటిని బయటకు తోడుతున్నారు. ఈ ప్రక్రియ మరో నెల రోజుల పాటు సాగనుంది.