2 లక్షల రుణమాఫీ చేసి.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి

2 లక్షల రుణమాఫీ చేసి.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి

భద్రాచలం రాములవారి సాక్షిగా పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి..రైతుల రుణం తీర్చుకుంటానన్నారు. మే 4వ తేదీ శనివారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మ జిల్లా దేశ రాజకీయాకు ఒక దిక్సూచి అని చెప్పారు.  ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులన్నారు. పోరాటాల గడ్డగా ఖమ్మం జిల్లాకు పేరుందని.. ఖమ్మం జిల్లాతోని ఎవరూ పెట్టుకోవద్దన్నారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఇచ్చే సెగ్మెంట్ ఖమ్మం అని చెప్పారు. ఖమ్మ ఎంపీ సగ్మెంట్ చరిత్రలో నిలుస్తుందని సీఎం అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కీలక పాయింట్స్:

  • బీఆర్ఎస్ సర్కార్ రూ.7లక్షల కోట్ల అప్పు చేసింది
  • కేసీఆర్ అంటేనే కాలకూట విషం
  • కేసీఆర్ ను కాంగ్రెస్ దగ్గరకు రానివ్వదు.. ఆయన చివరికి చేరేది బీజేపీలోనే.
  •  నామాను బకరా చేయడానికి కేసీఆర్ ఖమ్మం వచ్చారు
  • కేసీఆర్ పని అయిపోయింది.. బీఆర్ఎస్ కాటికి పోవాల్సిందే.
  • ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ను బండకేసి కొట్టాలి
  •  మెదీ తెలగాణను అవమానించారు. ఏ రకంగా ఇక్కడ ఓట్లు అడుగుతారు
  •  మోదీ పదేండ్లు దేశాన్ని పట్టిపీడించారు
  • రాష్ట్రానికి నిధులు అడిగితే..మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు
  • ప్రజా సమస్యలను తీర్చే బాధ్యత మాది.
  • బీజేపీ ఓటేస్తే.. రిజర్వేషన్లు రద్దు అవుతాయి.. 
  • రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి.