భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే : సీఎం రేవంత్ రెడ్డి

భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే : సీఎం రేవంత్ రెడ్డి

భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలో మైక్రో సాఫ్ట్ కొత్త  ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి.. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన...ఈ కొత్త కార్యాలయం వల్ల వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.  త్వరలోనే స్కిల్ యూనివర్సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. ఇందులో ఏఐసిటీ కూడా ఉంటుందన్నారు. హైదరాబాద్ తో మైక్రో సాఫ్ట్ కి మంచి బంధం ఉందన్నారు. భవిష్యత్ లో మరిన్ని కార్యాలయాలు స్థాపించి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు రేవంత్ రెడ్డి. 

ఇన్నోవేషన్స్ అడ్డాగా హైదరాబాద్ :  దుద్దిళ్ల శ్రీధర్ బాబు

 11 లక్షల స్క్వేర్ ఫీట్ లో సరికొత్త ఆఫీస్ ని మైక్రో సాఫ్ట్ నిర్మించడం సంతోషంగా ఉంది.  సేఫ్టీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం.  ఇన్నోవేషన్స్ హైదరాబాద్ అడ్డాగా మారింది. మనదగ్గర గ్లోబల్ టాలెంట్ మాత్రమే కాదు.. సత్య నాదెళ్ల లాంటి గ్లోబల్ లీడర్స్ ఉన్నారు. తెలంగాణ డిజిటల్ లైఫ్ లో మైక్రో సాఫ్ట్ కీ రోల్ పోషిస్తుంది. 100 శాతం డిజిటల్ కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. 9 మిలియన్ ఇళ్లకు ఫైబర్ కనెక్షన్ ఇస్తాం.హైదరాబాద్ ని కాపాడటానికి హైడ్రాని తీసుకొచ్చాం.  గ్లోబల్ కెపబులిటీ సెంటర్ల హబ్ గా హైదరాబాద్ మారిపోయింది. భవిష్యత్ కోసం అవసరమైన గ్లోబల్ టెక్నాలజీ మనదగ్గర బిల్డ్ అవుతుంది.