నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని.. ముట్టుకుంటే షాక్ కొడ్తది : సీఎం రేవంత్ రెడ్డి

నేను  హైటెన్షన్ వైర్ లాంటోడిని..  ముట్టుకుంటే షాక్ కొడ్తది :  సీఎం రేవంత్ రెడ్డి

తాను హైటెన్షన్ వైర్ లాంటోడినని  .. ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  పాలమూరులో ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం.   కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సీఎం. అంతకుముందు మహబూబ్ నగర్ టౌన్లో భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ నేతలు. ఉమ్మడి జిల్లా మంత్రి జూపల్లి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.   గతంలో  కేసీఆర్ పాలమూరు నుంచి గెలిచి చేసిందేమి లేదని విమర్శించారు.  పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని... పాలమూరు లిప్ట్ ను కూడా  పూర్తి చేయలేదన్నారు.  గతంలో పాలమూరుకు  మంత్రి పదవులు కూడా దక్కలేదని.. డీకే అరుణ కూడా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు.  

Also Read: ఏప్రిల్ 23వ తేదీ సెలవు ఇవ్వాలి.. తెరపైకి కొత్త డిమాండ్

పాలమూరు అభివృద్ధి కావలంటే 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్  గెలిపించాలని కోరారు సీఎం రేవంత్.   వంశీచంద్ రెడ్డిని లక్ష  మెజార్టీతో గెలిపించాలన్నారు.  కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని..  తనకు ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి ఉందన్నారు సీఎం.   కారు వర్క్ షాపు నుండి ఇంటికి రాదని.. తుక్కుకు అమ్మాల్సిందేనని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.  ఆడబిడ్డలను  ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.  3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు.