మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వట్టినాగులపల్లిలో ఫైర్ మెన్ ల పాసింగ్ ఔట్ పరేడ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు రేవంత్. 483 మంది ఫైర్ మెన్ అభ్యర్థులకు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. యువత ఆకాంక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కొలువుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 31 వేల మందికి నియామక పత్రాలిచ్చాం.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రేవంత్.
ఏ విపత్తు జరిగినా ముందుండేది ఫైర్ సిబ్బందేనన్నారు సీఎం రేవంత్. విద్య,వ్యవసాయం,యువతకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించామని చెప్పారు. అన్నదాతకు మరింత అండగా ఉండాలని బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. విద్య, వైద్యం, ఇరిగేషన్ కోసం ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతం ఎపుడు వస్తుందో తెలియకపోయేది..ఇపుడు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతం ఇస్తున్నామని చెప్పారు. కొలువుల కోసం నిరుద్యోగులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు రేవంత్. ఏ ఇబ్బంది ఉన్నా..మంత్రులు, ఉన్నతాధికారులను ఎప్పుడైనా కలవొచ్చని చెప్పారు రేవంత్.