ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగినయ్.. అందుకే వాస్తవాలు చెప్తున్న: సీఎం రేవంత్

ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగినయ్..  అందుకే వాస్తవాలు చెప్తున్న: సీఎం రేవంత్

తెలంగాణ ఆదాయం తగ్గింది..అప్పులు పెరిగాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంచనాలు వేరు ఆదాయం వేరు..అప్పులు వేరన్నారు. గత ప్రభుత్వ హయాంలో వసూలు చేయాల్సిన పన్నులు కూడా వసూలు చేయలేదన్నారు రేవంత్. తాము వచ్చాక దుబారా ఖర్చులు తగ్గించాం.. గత ప్రభుత్వంలో నచ్చితే నజరానా..నచ్చకపోతే జరిమానా విధానం ఉండేది..తమ ప్రభుత్వం వచ్చాక ఆ పాలసీకి స్వస్తి చెప్పామన్నారు  రేవంత్. ఇసుక మాఫీయా కట్టడికి చర్యలు తీసుకున్నాం..ఇసుకపై గతంలో  రోజుకు కోటిన్నర ఆదాయం వస్తే ఇపుడు మూడున్నర కోట్ల వరకు  ఆదాయం వస్తుందన్నారు రేవంత్. 

అబద్ధపు పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపలేం..అందుకే ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామని చెప్పారు రేవంత్  . రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడిన రేవంత్..రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు . తెలంగాణలో డ్రగ్స్,గంజాయి ఎక్కువైందన్నారు సీఎం రేవంత్. డ్రగ్స్ వినియోగంలో తెలంగాణ పంజాబ్ ను చేరుకునేలా ఉందన్నారు. యువతను దీని నుంచి కాపాడుకోవాలన్నారు రేవంత్.

ALSO READ | ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

జీఎస్టీ వసూళ్లలో  తెలంగాణ దేశంలోనే టాప్ అని అన్నారు రేవంత్.  భారత దేశంలోనే ధరల నియంత్రణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు.    ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొ్క్క హమీని అమలు చేస్తున్నాం. మొదటి 10 నెలల్లోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలివ్వలేదు. ఉద్యోగాలు,ఉపాధికల్పన,స్కిల్ డెవ్ లప్ మెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు రేవంత్.

 ఏడాది కాలంలోనే రైతులకు రూ. 2లక్షల వరకు  రుణాలు మాఫీ చేశామన్నారు రేవంత్.  ఇందిరమ్మ పాలనలో ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంచాం.  మహిళలకు ఫ్రీబస్, 5 లక్షల కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం.  42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేశాం . మార్చి 18న (రేపు )ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా ఆమోదం పొందుతుందన్నారు రేవంత్.