
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితలకు కాంగ్రెస్ అండగా ఉంటోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మాట్లాడిన రేవంత్..రాజకీయాలను పక్కన పెట్టి సంపూర్థ మద్దతు పలికారని తెలిపారు. వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్. వర్గీకరణ కోసం అనేక పోరాటాలు జరిగాయన్నారు. వర్గీకరణ కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు . ఉమ్మడి ఏపీకి దళితుడిని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు రేవంత్. దళిత బిడ్డ మీరా కుమారిని స్పీకర్ చేసిన చరిత్ర .. దళితుల అభ్యున్నతనికి అనేక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్సేనన్నారు రేవంత్
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించిందన్నారు రేవంత్. సుప్రీం తీర్పు వచ్చిన గంటసేపటికే ఎస్సీ వర్గీకరణపై సభలో ప్రకటన చేశాం. నూటికి నూరు శాతం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ఆనాడు చెప్పా. ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం వేశాం..ఆరుసార్లు ఈ కమిటీ భేటీ అయింది. 8 వేలకు పైగా వినతిపత్రాలను ఈ కమిషన్ తీసుకుంది. ఉపసంఘం సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్ వేసింది. ఏ ఒక్కరిక కూడా అన్యాయం జరగొద్దని కమిషన్ భావించింది. ఫిబ్రవరి 3న కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 4న ఈ రిపోర్ట్ ను కేబినెట్ ఆమోదించింది అని రేవంత్ అన్నారు.
రేవంత్ స్పీచ్ అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. బిల్లు ఆమోదం తెలపడంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి దామోదర రాజనర్సింహా.