
ఆకలినైనా భరిస్తా కానీ.. స్వేఛ్చను హరిస్తే ఊరుకోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో రేవంత్ మాట్లాడారు. జై తెలంగాణతో ప్రసంగం ప్రారంభించిన రేవంత్... అధికారంలోకి వచ్చిన వెంటనే బానిస సంకెళ్లను తెంచి ప్రజాపాలనను అందిస్తున్నామని చెప్పారు. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చామన్నారు.
రేవంత్ ప్రసంగం కీలక అంశాలు
- ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నం ఆవిష్కరిస్తాం
- మూసీ సుందరీకరణ పథకం ద్వారా వెయ్యి కోట్లతో పరివాహక ప్రాంతం ఉపాధికల్పన జోన్
- సచివాలయంలో కి సామాన్యుడు వచ్చేలా చేశాం
- ప్రజాభవన్ లో ప్రతీ మంగళ,శుక్రవారాల్లప్రజాధర్బార్ నిర్వహిస్తున్నాం
- మొదటి తేదీనే ఉద్యోగులకు ,పెన్షనర్లకు వేతనాలు
- త్వరిత గతిన రీజినల్ రింగ్ రోడ్డు పునర్నిర్మాణం
- అధికారిక ఉత్తర్వులు, వాహనాల పేర్లకు టీఎస్ బదులు టీజీగా మార్పు
- 22825 పాఠశాలల్లో రూ.1135 కోట్లు
- 50 ఐటీఐలలో నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ తో ఒప్పందం
- రైతుకు ఆర్థిక సాయం కింద రూ.7500 కోట్లు జమచేశాం
- ధాన్యం సేకరణ కోసం రూ.7245 కేంంద్రాలు తెరిచాం
- మార్చి 6న 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరాతో రికార్డు
- పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- అభయ హస్తం గ్యారంటీల కోసంకోటి 9 వేల కోట్ల దరఖాస్తులు వచ్చాయి
- రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10లక్షలకు పెంచాం
- 70 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం
- 11062 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం
- పేదల కోసం నాలుగున్నర లక్షల ఇళ్ల కోసం రూ.22500 కోట్లు రిలీజ్ చేశాం
- డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా వదిలేదు
- ఆకలినైనా భరిస్తాం..స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం
- ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరుముతాం
- ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే అభివృద్ధిలోరాజీలేని కృషి