అధికారులు అప్రమత్తంగా ఉండాలి..వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..వర్షాలపై  సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌తో పాటుగా రాష్ట్రవ్యాపంగా కురుస్తు్న్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.  సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం..   వర్షాలు, వర్ష ప్రభావంపై మాట్లాడారు.  వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని  సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  

హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మణికొండ, షేక్‌పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్, లక్డీకపూల్, పంజాగుట్ట తదితర ఏరియాల్లో వాన పడుతోంది. దీంతో నగరంలోని రోడ్లు నీటితో నిండిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌ లో  సుమారు గంట నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. దీంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రజల కోసం GHMC టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది. వర్షం వేళ అవ‌స‌ర‌మైతే త‌ప్ప ప్రజ‌లు ఇళ్లలో నుంచి బ‌య‌ట‌కు రావొద్దని సూచించింది.