
నల్లగొండ: కుక్కల దాడిలో గాయపడిన చిన్నారికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు.మూడు నెలలుగా కోమాలో ఉన్న బాలికకు మెరుగైన చికిత్సకు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వార్త పత్రికలు చదువుతూ బాలిక స్థితికి చలించిపోయారు. బాలిక ఆరోగ్య స్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడాలని అధికారులకు చెప్పారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండకు చెందిన హారిక కొద్ది రోజుల క్రితం ఇంటిముందు ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన హారిక కోమాలోకి వెళ్లింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా నయం కాలేదు.బాలిక తండ్రి రెండేళ్ల క్రితం చనిపోవడం..కుటుంబం పేదరికంలో ఉండటంతో మెరుగైన చికిత్స అందించలేకపోయారు. వైద్యం కోసం ఆదుకోవాలని హారిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.వార్తాపత్రికల్లో చిన్నారిపై వచ్చిన కథనాలను చూసిన సీఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు. హారికకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ణతలు తెలిపారు చిన్నారి కుటుంబ సభ్యులు.
►ALSO READ | తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జైకా కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ