భారీ వర్షాలకు అతాలకుతలం అయిన ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
కూసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గర వరద ఉధృతితో ఖమ్మం - సూర్యపేట జాతీయ రహదారిపై కొట్టుకపోయిన బ్రిడ్జిని పరిశీలించారు రేవంత్. పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించారు రేవంత్. ఇవాళ రాత్రి సీఎం రేవంత్ ఖమ్మంలోనే బస చేయనున్నారు. భారీ వర్షాలకు సెప్టెంబర్ 2న ఉదయం పాలేరు బ్రిడ్జి తెగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ALSO READ | ఖమ్మం.. జలదిగ్బంధం
మరో వైపు వరద ప్రభావిత మృతులకు ఎక్స్ గ్రేషియా 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్న ప్రకటించారు. వరదలకు ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.