సంగెంలో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న సీఎం రేవంత్

సంగెంలో మూసీ వద్ద సీఎం రేవంత్​రెడ్డి దాదాపు రెండున్నర గంటల పాటు ఉన్నారు. యాదగిరిగుట్టలో రివ్యూ మీటింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి 3:30 గంటలకు సంగెం చేరుకున్నారు. అనంతరం భీమలింగం స్వామిని దర్శించుకున్నారు. ఈ టైమ్ లో కొద్దిసేపు శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం లింగానికి పాలాభిషేకం చేశారు. మూసీకి పువ్వులతోపూజ చేశారు.