పిచ్చి కుక్క కరిస్తే సచ్చేటోళ్లకు.. బుల్డోజర్లు అవసరమా : సీఎం రేవంత్ సెటైర్లు

పిచ్చి కుక్క కరిస్తే సచ్చేటోళ్లకు.. బుల్డోజర్లు అవసరమా : సీఎం రేవంత్ సెటైర్లు

మూసీ ప్రక్షాళన విషయంలో బాధితులకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నామని.. డబుల్ బెడ్ రూం ఇల్లు, పిల్లలకు చదువులతోపాటు తరలింపునకు ఒక్కో ఇంటికి 25 వేల రూపాయల సాయం చేస్తున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

మూసీ బాధితుల బాధ అంతా కేటీఆర్, హరీశ్, బీజేపీ నేతలకు ఉన్నట్లు మాట్లాడుతున్నారని.. బుల్డోజర్లు మాపై నుంచి వెళ్లాలంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. మీలాంటోళ్ల కోసం బుల్డోజర్లు అవసరం లేదని.. పిచ్చికుక్క కరిస్తే సచ్చేటోళ్ల కోసం బుల్డోజర్లు అవసరమా అంటూ చురకలు అంటించారు. 

మీ కోసం ఒక్క బుల్డోజర్ కూడా కొనేది లేదని.. అన్ని బుల్డోజర్లు ప్రభుత్వం దగ్గర లేవంటూ సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో బాధితులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని.. ప్రభుత్వం ఏమీ గొద్దుపోలేదని.. డబ్బులు ఉన్నాయన్నారు. 7 లక్షల కోట్లు అప్పులు చేసి పోయినా.. పేద ప్రజలను ఆదుకోవటానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు సీఎం. 

Also Read:-ఒకే ఒక్క కార్డు.. 30 శాఖల సమాచారం ఇచ్చేస్తుంది

పదేళ్లు అధికారంలో ఉండి.. మూసీపై ఎన్ని మాటలు మాట్లాడింది.. ఏ విధంగా మాట్లాడిందీ అందరికీ తెలుసునని.. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంచి పని చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ కేటీఆర్, హరీశ్ రావులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.