కేటీఆర్, హరీశ్ ఫాంహౌస్ మురికినీళ్లు.. పేదలు తాగాలా : సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్, హరీశ్ ఫాంహౌస్ మురికినీళ్లు.. పేదలు తాగాలా : సీఎం రేవంత్ రెడ్డి

మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీశ్ చేస్తున్న రాద్దాంతంపై చాలా సీరియస్ గా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మూసీ నదిని బిట్లు బిట్లుగా లక్షలు, కోట్ల రూపాయలకు అమ్ముకున్నది మీ పార్టీ వాళ్లు కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హియాయత్ సాగర్ జంట జలాశయాలను సైతం కబ్జా చేసింది మీరు కాదా అంటూ కేటీఆర్, హరీశ్ రావును ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మీలాంటి బలిసినోళ్ల ఫాంహౌస్ ల నుంచి వచ్చే మురికినీటిని మూసీ పక్కన ఉండే పేదలు తాగాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. 

ALSO READ : పిచ్చి కుక్క కరిస్తే సచ్చేటోళ్లకు.. బుల్డోజర్లు అవసరమా : సీఎం రేవంత్ సెటైర్లు

ఫాంహౌస్ చుట్టూ కట్టుకున్న ఫాంహౌస్ లు అన్నీ కేటీఆర్, హరీశ్, కేవీపీలవే కదా అన్నారాయన. మూసీ పేరు చెప్పి ఎన్నాళ్లు తప్పించుకుంటారో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. నెల రోజుల తర్వాత అయినా మీ భరతం పడతాను.. చింతపండు చేస్తా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

జవహర్ నగర్ ఏరియాలో ప్రభుత్వానికి వెయ్యి ఎకరాల భూమి ఉందని.. ప్రతి పేద కుటుంబానికి 150 గజాలు ఇచ్చి.. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటూ భరోసా ఇచ్చారు. బీజేపీ వాళ్లను సైతం వదల్లేదు సీఎం రేవంత్ రెడ్డి. గుజరాత్ సబర్మతి నదిని ఏ విధంగా అభివృద్ధి చేశారో కనిపించటం లేదా.. మోదీ చేస్తే గొప్ప.. హైదరాబాద్ మూసీ చేద్దాం అంటే మాత్రం బీజేపీ వాళ్లకు ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు. మూసీ కోసం మోదీ దగ్గరకు వెళ్లి నిధులు తెచ్చుకుందామా అంటూ పిలుపునిచ్చారు.