ప్రస్తుత ఇండస్ట్రీకి అనుగుణంగా సిలబస్ అప్ గ్రేడ్ చేయండి: సీఎం రేవంత్

ప్రస్తుత ఇండస్ట్రీకి అనుగుణంగా  సిలబస్ అప్ గ్రేడ్ చేయండి: సీఎం రేవంత్

మార్కెట్ అవసరాలకు అనుగుణ మైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాల న్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు కమిటీని నియమించి, నిపుణులు, విద్యావేత్తలు సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు.సచివాలయంలో కార్మిక, ఉపాధి క ల్పన శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐటీఐ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాలని, శిక్షణ తీసుకుంటున్న వారికి సమగ్రమైన శిక్షణ అందేలా జాగ్రత్తపడాలని సూచించారు. ఐటీఐ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఐటీఐ, ఏటీసీలేని అసెంబ్లీ సెగ్మెంట్లను గుర్తించి నివేదిక  సమర్పించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ, ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ALSO READ | కన్హాలో యువ సమ్మేళనం.. మంత్రి ఉత్తమ్ హాజరు