మహిళా శక్తి క్యాంటీన్ లో లడ్డూ టేస్ట్ చూసిన సీఎం రేవంత్

మహిళా శక్తి క్యాంటీన్ లో లడ్డూ టేస్ట్ చూసిన సీఎం రేవంత్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.   మహిళా సంఘాల ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించి  సభ్యులతో ముచ్చటించారు రేవంత్.   ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులను వ్యాపారం ఎలా సాగుతుందంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు రూ. 15000 వరకు వ్యాపారం జరుగుతుందని ఆర్థికంగా నిల తొక్కుకోగలుగుతున్నామని సీఎంకు చెప్పారు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు. ఈ సందర్భంగా లడ్డూ టేస్ట్ చూశారు రేవంత్. 

ALSO READ | మీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్

 అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ మహిళల ఉన్నతికి రాష్ట్రప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందన్నారు  రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 65లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. పాఠశాలల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. స్కూల్ పిల్లల బట్టలు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. మహిళలు ఇంట్లో కూర్చొని వేల రూపాయలు సంపాదించొచ్చన్నారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఇందిరా మహిళశక్తి భవనాన్ని మంజూరు చేశామన్నారు. 

1000మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ ప్లాంట్లను మహిళలకు అప్పగించామన్నారు. ఆర్టీసీలో బస్సులను మహిళలకు లీజుకు ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 600మంది బస్సులను మహిళా సంఘాలకు అప్పజెప్పాం.. రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు మహిళలను యాజమానులను చేస్తామన్నారు.