మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం

మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరిన రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. పగుళ్లు వచ్చిన ప్రాంతాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. బ్యారేజీ పిల్లర్ల పునాదుల దగ్గరకు వెళ్లి పగుళ్లు చూశారు. కాంక్రీట్ నిర్మాణాలన్నీ ముక్కలయ్యాయి. పిల్లర్ల నుంచి ఐరన్ రాడ్స్ బయటకొచ్చాయి. 

కుంగిన పిల్లర్ బ్లాక్ 7 నెం 20 దిగువకు గోదావరి రివర్ బెడ్ ప్రాంతాన్ని, పగిలిన 20వ పిల్లర్ మొత్తం వాల్‌ని సీఎం రేవంత్ రెడ్డి బృందం నిశితంగా పరిశీలించింది. సీఎం, మంత్రులు ఇరిగేషన్ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు.

Also Read:మేడిగడ్డ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం