జనవరి 31న మొగిలిగిద్దకు సీఎం

జనవరి 31న మొగిలిగిద్దకు సీఎం

షాద్ నగర్,వెలుగు:   నియోజక వర్గంలోని ఫరుక్ నగర్ మండలం మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ నెల 31న నిర్వహించే ఉత్సవాలకు  సీఎం  రేవంత్ రెడ్డి  రానున్నారు.   ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ హర గోపాల్, స్థానిక శాసనసభ్యులతో కలిసి  కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం పాఠశాల ఆవరణలో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ...    ప్రొఫెసర్ హర గోపాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిని  ఉత్సవాలకు ఆహ్వానించడం గర్వకారణం అన్నారు.  ఈ సమావేశంలో డీఈఓ సుశిందర్ రావు, డీపీఓ సురేశ్​ మోహన్, ఆర్డీఓ సరిత పాల్గొన్నారు. 

 హరగోపాల్​కు ఎమ్మెల్యే పాదాభివందనం  

నియోజకవర్గంలో పాఠశాల, కళాశాలల  అభివృద్ధిపై ఎమ్మెల్యే శంకర్​ కృషి చేయడం అభినందనీయమని ప్రొ. హరగోపాల్​ అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే   శంకర్​ను క్యాంప్​ ఆఫీస్​లో కలిశారు.  ఈ సందర్భంగా హరగోపాల్​కు ఎమ్మెల్యే శంకర్​ పాదాభివందనం చేసి, స్వాగతం  పలికారు. అనంతరం  ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించారు.   కార్యక్రమంలో పాలమూరు ప్రజా వేదిక కన్వీనర్ రాఘవులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ అలీ ఖాన్ బాబర్, అగునూరు విశ్వం, చల్లా శ్రీకాంత్ రెడ్డి దితరులున్నారు.