
- అహ్మదాబాద్ లో రెండురోజుల పాటు ఏఐసీసీ కీలక సమావేశాలు
- రేపు హాజరుకానున్న ముఖ్యమంత్రి
- ఇవాళ సాయంత్రమే బయలుదేరనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి గుజరాత్లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో రేపు, ఎల్లుండి ఏఐసీసీ కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈమీటింగ్‌లో పాల్గొనేందుకు రేపు ఆయన అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు కీలక నేతలు ఇవాళ సాయంత్రమే బయలుదేరనున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44 మంది నేతలకు ఆహ్వానం అందింది. జాతీయస్థాయిలో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశాల్లోనే కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్వివరించనున్నారు.