
మరిపెడ, వెలుగు: భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకుని సర్వం కోల్పోయిన సీతారాం తండావాసులకు మోడల్ కాలనీ నిర్మించి, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో వరద బాధితులను ఆయన పరామర్శించారు.
ఇస్లావత్, మంగీలాల్ కవిత ఇంటికి వెళ్లి మాట్లాడారు. తాము ఇక్కడ ఉండలేమని, వేరేచోట పునరావాసం కల్పించాలని తండావా సులు కోరగా.. సీతారాం తండా, పక్కనున్న మరో రెండు తండాలను కలిపి వేరే ప్రాంతంలో ఓకే గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి మోడల్ కాలనీ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తండావాసులకు తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.