ఓవర్ టు ఢిల్లీ: హస్తినకు అధికార పక్షం, ప్రతిపక్షం

ఓవర్ టు ఢిల్లీ: హస్తినకు అధికార పక్షం, ప్రతిపక్షం
  • హైకమాండ్  పిలుపుతో సీఎం, పీసీసీ చీఫ్​
  • సుప్రీంకోర్టు కేసు అంశంపై కేటీఆర్
  • కేంద్ర మంత్రులను కలిసిన కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలు హస్తినకు షిప్ట్ అయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితన్ గడ్కరీతో భేటీ అయ్యారు. యూనివర్సిటీల అంశంపై వినతిపత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. 

ఏఐసీసీ టాప్ లీటర్లు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ వివరాలను వివరించబోతున్నట్లు తెలుస్తోంది.