- హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: యాదగిరి గుట్ట విమాన గోపురం ప్రారంభోత్సవాన్ని వచ్చేనెల 23న నిర్వహించడానికి ఆలయ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 11.54 గంటలకు బంగారు విమాన గోపురాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.
అంతేకాకుండా, గుట్టలో వచ్చేనెల 19 నుంచి 23 వరకు మహాకుంభాభిషేకం, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం పనులు ఇప్పటికే 50 శాతానికి పైగా కంప్లీట్ అయ్యాయి. వచ్చే నెల15 వరకు తాపడం పనులు పూర్తి కానున్నాయని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. మార్చి నుంచి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. గోపురం తాపడం పనులు ప్రారంభోత్సవానికి రావాలని ఇప్పటికే ఆలయ అధికారులు సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.