మార్చి 2న వనపర్తికి సీఎం రాక

మార్చి 2న వనపర్తికి సీఎం రాక

వనపర్తి, వెలుగు: మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి వస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.  వనపర్తిలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అంగీకరించారని తెలిపారు.  మంగళవారం నాగర్​కర్నూల్​ఎంపీ మల్లురవితో కలిసి ఆరోగ్యశాఖ మంత్రిని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కలిశారు.

మార్చి 2వ తేదీన సీఎంతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారన్నారు. పెబ్బేరులో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ. 1000 కోట్ల అభివృద్ధి  కార్యక్రమాలకు శంకుస్థాపనలు  చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.