ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్
  • బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టంపై హైకమాండ్​కు రిపోర్టు!

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన ఆయన పెండ్లి వేడుకకు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే శనివారం పార్టీ అగ్రనేతలను కలవనున్నట్లు సమాచారం. 

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా త్వరలో రూపొందించనున్న చట్టం గురించి హైకమాండ్ కు నివేదించే అవకాశం ఉంది. కుల గణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేయించనున్న విషయం తెలపనున్నారు. వీటితో పాటు పీసీసీ కార్యవర్గ విస్తరణ, నామినేటెడ్​పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఇతర అంశాలపై చర్చించే చాన్స్ ఉంది.