కోమటిరెడ్డి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పలు పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై చర్చిస్తున్నారు. తాజాగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ సమీక్ష జరపనున్నారు. 

ఈ క్రమంలో కాసేపట్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజగోపాల్ నివాసంలో భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశం నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు భువనగిరి పార్లమెంట్ పరిధి నేతలు.