జనవరి 29న పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష

జనవరి 29న పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష
  • పెండింగ్ బిల్లులు, స్థానిక
  • ఎన్నికలపై చర్చించే అవకాశం


హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పంచా యతీ రాజ్​శాఖపై రివ్యూ చేపట్టను న్నారు. ఆ శాఖలో పెండింగ్ బిల్లులు, ఉద్యోగులు, సిబ్బంది పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకా శం ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో మంగ ళవారం సెక్రటేరియెట్​లో పీఆర్, ఆర్డీ కార్యదర్శి లోకేశ్​కుమార్ ఆ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఆర్​లో అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల కు సంబంధించి రిపోర్ట్ రెడీ చేయాలని ఆదేశించారు. సీఎం రివ్యూకు పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు.