పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని పోలీస్  కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మే 25వ తేదీ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. 

కమాండ్ కంట్రోల్ లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించనున్న రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ లో ఉన్న నార్కోటిక్స్ బ్యూరో పని తీరుపై ఆరా తీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్కోటిక్స్ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు సీఎం. తెలంగాణ లో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.