హైదరాబాద్, వెలుగు : ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌లో సమీప బంధువు పెండ్లికి సీఎం హాజరుకానున్నట్టు తెలిసింది. మంగళవారం ఢిల్లీ వెళ్లి.. అక్కడి నుంచి రాజస్థాన్‌కు బయలుదేరనున్నారు. అనంతరం మళ్లీ ఢిల్లీకి వచ్చి ఏఐసీసీ పెద్దలతోపాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నది.
ఇందుకోసం పీఎంతోపాటు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 వరకు వాయిదా పడిన నేపథ్యంలో.. పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలు కూడా సీఎంతోపాటు ఢిల్లీ వెళ్లే చాన్స్ ఉన్నది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, తదితర అంశాలపై పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నారు.