
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ఘన్పూర్పట్టణం శివునిపల్లి శివారు పాలకుర్తి రోడ్డులోని సీఎం సభాస్థలాన్ని బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించారు. ఆయన వెంట కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్, అడిషనల్కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింకేష్‌కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఉన్నారు.
ప్రధాన సభావేదిక, హెలిప్యాడ్, శంకుస్థాపనకు సంబంధించి శిలాఫలకాలు ఏర్పాటు, ముఖ్యమైన పనులపై ఆఫీసర్లకు సూచనలు చేశారు. సీఎం సభకు 50 వేల మందికి పైగా రానున్నారని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్డీవో వెంకన్న, సీఐ వేణు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.