హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జనవరిలో స్విట్జర్లాండ్ లో వెళ్లనున్నారు. 2025 జనవరి 20 నుంచి 24 వరకు స్విట్లర్జాండ్ లో పర్యటిస్తారు. దావోస్ లోని ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
సీఎం దావోస్ పర్యటనకోసం రూ.12కోట్ల 30లక్షల బడ్జెట్ విడుదల చేసింది సర్కార్. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సదస్సులో ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో రేవంత్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు.
ALSO READ | రైతులకు బిగ్ అలర్ట్.. రైతు భరోసా స్కీమ్‌పై మంత్రి సీతక్క కీలక ప్రకటన