
మంచిర్యాల, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మంచిర్యాలకు రానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నస్పూర్ లో కలెక్టరేట్ సమీపంలో గ్రాడ్యుయేట్లతో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొంటారు. ఆ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు హెలికాప్టర్ లో మంచిర్యాలకు చేరుకుంటారు.
2.20 గంటలకు గ్రాడ్యుయేట్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఇక్కడి నుంచి కరీంనగర్ మీటింగ్ కు బయలుదేరుతారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నస్పూర్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు