అన్నదాతలకు అండగా నిలిచేది రైతు రుణమాఫీ పథకం: సీఎం రేవంత్

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.  అన్నదాతలకు అండగా నిలిచేది  రైతు రుణమాఫీ స్కీం అని చెప్పారు. ప్రజాప్రభుత్వ నిర్ణయాల్లో రైతుసంక్షేం ఉంటుందన్నారు. ఎంతకష్టమైనా.. ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు.  రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టులోపు రూ. 2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. 

 2 లక్షల రైతు రుణమాఫీపై జూలై 15న తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.  రూ.2 లక్షలలోపు పంట రుణాల మాఫీకి కుటుంబాన్ని యూనిట్​గా తీసుకోవాలని రాష్ట్ర​ సర్కారు నిర్ణయించింది. అర్హుల గుర్తింపున‌‌‌‌కు రేష‌‌‌‌న్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్​ సర్కారు.. ఇందుకు సంబంధించిన  గైడ్​లైన్స్​ను  అధికారికంగా విడుదల చేసింది.

Also Read:-ఉప్పల్ లో రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి..

 దీని ప్రకారం.. ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.2లక్షల దాకా క్రాప్​లోన్లు మాఫీ చేస్తారు. ముందుగా చెప్పినట్టు 2018 డిసెంబర్  12  నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న  రైతుల్లో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తారు. ముందుగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు గైడ్​లైన్స్​ చేరవేసి, ఆ ప్రకారం అర్హుల జాబితాలు సేకరిస్తారు. రూ.2 లక్షలకు మించి క్రాప్​లోన్లు (అసలు, వడ్డీతో కలిపి) ఉన్న కుటుంబాలు ముందుగా బ్యాంకులకు బ్యాలెన్స్​అమౌంట్ ​కట్టాలి. ఆ తర్వాత మిగిలిన రూ.2 లక్షలను సర్కారు చెల్లిస్తుంది.