కాలిఫోర్నియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రపంచ ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్, ప్రొ.రామ్ చరణ్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రపంచ వ్యాపార ఆలోచనలు , ధోరణులను రూపొందించడంలో టాప్ కంపెనీలు, సీఈవోలు, బోర్డులతో కలిసి పనిచేసిన 40 సంవత్సరాల సుదర్ఘ అనుభవం ఉన్న రామ్ చరణ్.. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలపట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
It was a great delight to meet Professor Ram Charan, world-renowned business consultant, author and speaker, at the sidelines of a business conference in Bay Area, California.@DrRam_Charan, who has spent over 40 years working with many top companies, CEOs and boards, shaping… pic.twitter.com/BR7bmDK47I
— Telangana CMO (@TelanganaCMO) August 10, 2024
అమెరికాలో కీలక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, టయోటా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, కీ బ్యాంక్, నోవార్టిస్, యిల్డిజ్ హోల్డింగ్స్, UST గ్లోబల్, ఫాస్ట్ రిటైలింగ్ (Uniqlo), మ్యాట్రిక్స్‌తో సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలతో ఆచరణాత్మక అనుభవం, సంక్లిష్టతను తగ్గించడంలో ప్రసిద్ధి చెందిన ప్రొఫెసర్ రామ్.. ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యాపారం, ధోరణలు అమలు చేయడానికి మాకు అనేక ఆసక్తికరమైన ఆలోచనలను అందించారని చెప్పారు. ప్రొ. రామ్ చరణ్ ను హైదరాబాద్ కు రావాలని..తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆహ్వానించినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.