మలక్ పేట, వెలుగు: తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్, డైరీని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం తన ఇంట్లో జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా, ఐజీలు వై.రాజేశ్, ఎన్.మురళీబాబు, డిప్యూటీ ఐజీలు డాక్టర్ డి.శ్రీనివాస్, ఎం.సంపత్ తో కలిసి డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు.