జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్

జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీని సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించారు. గురువారం సచివాలయంలో  సీఎం రేవంత్​ రెడ్డిని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోధనపల్లి వేణుగోపాల్​ రెడ్డి, ఇతర సభ్యులు కలిసి డైరీని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ​అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేలా జర్నలిస్టులు తమవంతు కృషి చేయాలని సీఎం సూచించారు.

కార్యక్రమంలో వేణుగోపాల్​ రెడ్డితో పాటు జనరల్​ సెక్రటరీ మహ్మద్​ సాదిక్​ పాషా, వైస్​ ప్రెసిడెంట్లు కోడూరు శ్రీనివాసరావు, జంగిటి వెంకటేశ్​, జాయింట్​ సెక్రటరీ మధు మల్కేడికర్​, కోశాధికారి సురేశ్ వేల్పుల, ఎక్జిక్యూటివ్​ మెంబర్లు సోము సముద్రాల, కంచెరాజు తదితరులు  పాల్గొన్నారు.