సంతోష్ ట్రోఫీ పోస్టర్​ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

సంతోష్ ట్రోఫీ పోస్టర్​ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ వేదికగా ఈ నెల14 నుంచి ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీ పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దాదాపు 57 ఏండ్ల తర్వాత హైదరాబాద్ సిటీ చారిత్రాత్మకమైన ఫుట్ బాల్ క్రీడా ప్రతిష్టాత్మక టోర్నీ సంతోష్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరంగా ఉందని తెలిపారు. గురువారం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆధ్వర్యంలో తుగ్లక్ రోడ్ లోని సీఎం అధికారిక నివాసంలో ట్రోఫీని ఆవిష్కరించారు.

ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారులు జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ చీఫ్ డాక్టర్ రోహిన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం శివసేనా రెడ్డి మాట్లాడుతూ... డిసెంబర్14 – 31 వరకు జరిగే ఈ ట్రోఫీకి సంబంధించి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 37 జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు.