బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీగవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు మచ్చలేని మనిషి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో ఆదివారం (జనవరి 12, 2025) విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా విద్యా సాగర్ రావును ఎవరూ వేలెత్తి చూపలేదని సీఎం అన్నారు. విద్యాసాగర్ రావు అంటే అందరికీ సాగర్ జీ గా పరిచయమని.. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న నేత అని ప్రశంసించారు.
ALSO READ | విద్యార్థి రాజకీయాలు లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు:సీఎం రేవంత్రెడ్డి
గతంలో విశ్వవిద్యాలయాల నుంచే విద్యార్థి నాయకులు, నాయకులు వచ్చేవారని, ఇప్పుడు విద్యార్థి రాజకీయాలు లేకపోవడమే ఈ నాటి ఫిరాయింపులకు కారణమని సీఎం అన్నారు. రాష్ట్రంలో విద్యార్థి రాజకీయాలు మళ్లీ కావాలనీ అందుకే సీఎం కాగానే యూనివర్సిటీలపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. వర్సిటీల్లో వీసీలు నియమించామని.. బడ్జెట్ పెంచామని తెలిపారు. ప్రభుత్వం అంటే అధికార పక్షమే కాదు.. ప్రతిపక్షం కూడా అని..
విమర్శలకు, సలహాలకు ప్రతిపక్షం ఉండాలని సీఎం రేవంత్ అన్నారు.