అంకాపూర్​ చికెన్​ తినిపిస్తవా?..రైతులతో సీఎం సరదా

అంకాపూర్​ చికెన్​ తినిపిస్తవా?..రైతులతో సీఎం సరదా
  • రుణమాఫీ అయినందుకు ఎట్లనిపిస్తున్నది.. రైతులతో సీఎం సరదా సంభాషణ

హైదరాబాద్​, వెలుగు : రుణమాఫీ సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైతులతో సీఎం రేవంత్​రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​లో ముచ్చటించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రుణమాఫీ అయినందుకు రైతులు సీఎంతో తమ ఆనందం పంచుకున్నారు. ఇన్నాళ్లూ అప్పుల్లో ఉన్నామని, ఇప్పుడు రుణవిముక్తి పొందామని తెలిపారు. అయితే.. ఈ ఆనందం సమయంలో తమకు అంకాపూర్​ చికెన్​ తినిపిస్తావా? అంటూ నిజామాబాద్​ రైతును సీఎం రేవంత్​ సరదాగా అడిగారు.

పిల్లలను  మంచిగా చదవించాలని మరో రైతును.. ఆరోగ్యం ఎలా ఉందని ఇంకో రైతును అడిగి తెలుసుకున్నారు.  ఆద్యంతం సరదాగా ఈ వీడియో కాన్ఫరెన్స్​ సాగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్​లో జిల్లాల్లోని రైతు వేదికల నుంచి రైతులు.. సెక్రటేరియెట్​ నుంచి సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి, అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​, మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు పాల్గొన్నారు.   

మిమ్మల్ని చూస్తే నమ్మకం కలిగింది 

రుణమాఫీ అయినందుకు రైతులమంతా సంబురాల్లో ఉన్నామని నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం మందర్నాకు చెందిన రైతు రవి సీఎం రేవంత్​తో అన్నారు. వీసీలో రవితో సీఎం మాట్లాడారు.  

ర‌‌వి : రుణమాఫీ అయినందుకు నాకు మాట‌‌లు రావ‌‌డం లేదు. గ‌‌తంలో ప్రభుత్వాలు, పార్టీలు రుణ‌‌మాఫీపై హామీ ఇచ్చి నెర‌‌వేర్చక‌‌పోవ‌‌డంతో వ‌‌డ్డీలు పెరిగి అప్పులు మిగిలిపోయినయ్​. రుణ‌‌మాఫీపై ఎవ‌‌రు హామీ ఇచ్చినా న‌‌మ్మే ప‌‌రిస్థితి లేకుండా పోయిండె. ఇప్పుడు న‌‌మ్మకం క‌‌లిగింది. సంతోషంగా ఉంది. మ‌‌రో రాజ‌‌శేఖ‌‌ర్‌‌రెడ్డిలా రేవంత్ రెడ్డిని చూస్తున్నం. రైతుల ఆశీస్సుల‌‌తోనే రైతు రాజ్యం ఉంటుంది.
సీఎం :  మీ నిజామాబాద్ జిల్లాకు  ఇయ్యాళ రూ.225 కోట్లు రుణ‌‌మాఫీ కింద ఇస్తున్నం.
ర‌‌వి : రుణమాఫీ అయినందుకు నాట్లు వేసుకుంటూ స్వీట్లు పంచుకుంటున్నం సార్​. దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు
సీఎం :  సరే.. రుణమాఫీ చేసినందుకు అంకాపూర్ చికెన్ తినిపిస్తవా...? (స‌‌ర‌‌దాగా...)
ర‌‌వి : త‌‌ప్పకుండా సార్​. అంత అదృష్టం ఎట్ల వ‌‌దులుకుంటం సార్‌‌.

పిల్లలు ఏం చదువుతున్నరు

- ఖ‌‌మ్మం జిల్లా రైతు సీతారాంతో సీఎం

అప్పుల్లో ఉన్నాన‌‌ని, రుణ‌‌మాఫీతో ఎంతో సంతోషం గా ఉంద‌‌ని ఖ‌‌మ్మం జిల్లా ర‌‌ఘునాథపాలెం మండ‌‌లం వి.వెంక‌‌టాయ‌‌పాలెం గ్రామానికి చెందిన రైతు కుతుంబాక సీతారాం సీఎం రేవంత్​కు తెలిపారు. 

సీతారాం : రుణ‌‌మాఫీతో సంతోషం క‌‌లిగింది సార్. యువ రైతుల‌‌కు సాగు చేయాల‌‌నే సంక‌‌ల్పాన్ని మీరు క‌‌ల్పించారు.
సీఎం :  సీతారాం.. నీకు ఎంత భూమి ఉంది?  ఎంత అప్పు ఉంది?
సీతారాం : నాలుగున్నర ఎక‌‌రాల భూమి, రూ.78 వేల అప్పు ఉంది.
సీఎం :  మొత్తం రుణ‌‌మాఫీ అవుతున్నది.. మీకు ఎట్లనిపిస్తున్నది?
సీతారాం : చాలా సంతోషంగా ఉంది సార్​.. మీరు చ‌‌ల్లగా ఉండాలి.
సీఎం : పిల్లలు ఎంత‌‌మంది సీతారాం?
సీతారాం : ఇద్దరు పాప‌‌లు. పెద్ద పాప ఇంట‌‌ర్‌‌, చిన్న పాప ప‌‌దో త‌‌ర‌‌గ‌‌తి చ‌‌దువుతున్నారు.
సీఎం : ఇద్దర్నీ మంచిగా చ‌‌దివించు.. చ‌‌దువు ఆపొద్దు. 
సీతారాం : ఆపించ‌‌ను సార్‌‌.. మంచిగా చ‌‌దివిస్త.

వ‌‌రంగ‌‌ల్ స‌‌భ‌‌కు రైతుల‌‌ను తీసుకొస్త

- సీఎంతో వరంగల్​ జిల్లా రైతు ఎల్లయ్య

వ‌‌రంగ‌‌ల్‌‌లో నిర్వహించ‌‌నున్న రాహుల్ గాంధీ కృత‌‌జ్ఞత స‌‌భ‌‌కు తాను రావ‌‌డంతో పాటు ఇత‌‌ర  రైతుల‌‌ను తీసుకువ‌‌స్తాన‌‌ని వ‌‌రంగ‌‌ల్​ జిల్లాకు చెందిన రైతు ఎల్లయ్య సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. 

ఎల్లయ్య : ఏక‌‌కాలంలో రూ.2 ల‌‌క్షల రుణ‌‌మాఫీ చేయ‌‌డం దేశ చ‌‌రిత్రలోనే పండుగ రోజులా క‌‌నిపిస్తున్నది.
సీఎం : రుణ‌‌మాఫీ డిక్లరేష‌‌న్ వ‌‌రంగ‌‌ల్‌‌లోనే చేసినం తెలుసా?
ఎల్లయ్య : తెలుసు సార్​. వ‌‌రంగ‌‌ల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌‌లో రాహుల్ గాంధీ వ‌‌చ్చిన స‌‌భ‌‌లో చేసిన్రు. ఆ మాట‌‌ను నిల‌‌బెట్టుకున్నరు.
సీఎం :  ఆ స‌‌భ‌‌కు వ‌‌చ్చినవా?
ఎల్లయ్య : వ‌‌చ్చిన.
సీఎం : మళ్లా వ‌‌రంగ‌‌ల్‌‌లో స‌‌భ పెట్టి రాహుల్ గాంధీని పిలుద్దమా?
ఎల్లయ్య : పిలిచి కృత‌‌జ్ఞత‌‌లు తెలుపుదం సార్​. 
సీఎం :  స‌‌భ‌‌కు నువ్వు వ‌‌స్తవా?
ఎల్లయ్య : త‌‌ప్పకుండా వ‌‌స్త. వ‌‌రంగ‌‌ల్ జిల్లా అంటేనే రైతులు. స‌‌భ‌‌కు నాతో పాటు రైతుల‌‌ను తీసుకొస్త.

తుమ్మిడిహెట్టి వ‌‌ద్ద ప్రాజెక్టు కడ్తం

ఆదిలాబాద్​ రైతు మహేందర్​తో సీఎం

ప్రాణ‌‌హిత న‌‌దిపై తుమ్మిడి హెట్టి వ‌‌ద్ద ప్రాజెక్టు క‌‌ట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామ‌‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండ‌‌లం బండ్ల నాగాపూర్ గ్రామానికి చెందిన రైతు మ‌‌హేంద‌‌ర్‌‌తో సీఎం ముచ్చటించారు. వారి మ‌‌ధ్య సంభాష‌‌ణ ఇలా సాగింది.