- విజయోత్సవ సభను సక్సెస్ చేసేందుకు అధికారుల ఏర్పాట్లు
పెద్దపల్లి, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పాల్గొననున్న విజయోత్సవ సభ స్థలాన్ని అధికారులతో కలిసి కలెక్టర్శ్రీహర్ష సోమవారం పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సభలో గ్రూప్–4, ఇతర పోటీ పరీక్షలకు ఎంపికైన 9 వేల మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ఇవ్వనున్నారు. కలెక్టర్ వెంట పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, తహసీల్దార్ రాజ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.