జనవరి 26న కోస్గిలో సీఎం పర్యటన

జనవరి 26న కోస్గిలో సీఎం పర్యటన
  • ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

కోస్గి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించిన నాలుగు కొత్త పథకాలను సీఎం రేవంత్​రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. శనివారం గ్రామంలో కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా స్థలం, గ్రామ శివారులో హెలిప్యాడ్  స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. పోలీసు బందోబస్తుపై డీఎస్పీ నల్లపు లింగయ్యతో చర్చించారు. కాడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్  మండల అధ్యక్షుడు రఘువర్ధన్  రెడ్డి, ఆర్డీవో రామచంద్రనాయక్, గ్రంథాలయ చైర్మన్  వాళ్ల విజయ్ కుమార్  పాల్గొన్నారు.