యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. తొలిరోజు సీఎం ఫ్యామిలీ ప్రత్యేక పూజలు

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 2024 మార్చి 11 సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు యాదాద్రి చేరుకున్నారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ప్రధాన ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకటి రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.

ALSO READ :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్టకు రావడంతో.. ప్రొటోకాల్‌‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆలయ ఆఫీసర్లు, పోలీసులు అన్ని ఏర్పాట్లు  చేశారు. ఈ క్రమంలో కొండపైకి ఇతర వాహనాలను అనుమతించలేదు. ఉదయం 11 గంటల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు.