కురుమూర్తి స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

కురుమూర్తి స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (నవంబర్ 10) తన సొంత జిల్లా మహబూబ్ నగర్‎లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‎లోని కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు హైదరాబాద్ నుండి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్‎కు బయలుదేరారు. అమ్మాపూర్లోని కురుమూర్తి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. 

వేద పండితులు పూర్ణకుంభంతో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. పలువురు మంత్రులతో కలసి కురుమూర్తి స్వామని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం ఆలయ సమీపంలో ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ ఇతర నాయకులు పాల్గొన్నారు.