వరదల వల్ల ఆవాసం కోల్పోయిన బాధితులందరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలతో కలిసి పురుషోత్తమాయ గూడెంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు.
Also Read:-వరద బాధితులకు రూ.130 కోట్లు
వరదలతో ఆగమైన 3 తండాలను కలిపి ఒకే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి.. త్వరలోనే బాధితుల కోసం మంచి కాలనీ నిర్మించండని అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు10 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు ఇవ్వండిని అధికారులకు సూచించారు. వరదల్లో పాస్ పుస్తకాలు, సర్టిఫికేట్ల కొట్టుకుపోయాయనిఎవరు బాధపడొద్దని.. కొత్త సర్టిఫికేట్ల జారీ విషయంలో అధికారులు దగ్గర ఉండి చర్యలు తీసుకుంటారని చెప్పారు. వర్షం, వరదల వల్ల ధ్వంసమైన రోడ్లకు వెంటనే రిపేర్లు చేయండని అధికారులను ఆదేశించారు.