పంట నష్టం కింద ఎకరాకు 10 వేలు : సీఎం రేవంత్​

పంట నష్టం కింద ఎకరాకు 10 వేలు : సీఎం రేవంత్​
  • బాధితులను అన్ని విధాలా ఆదుకుంటం
  • మృతుల కుటుంబాల‌‌కు రూ. 5 ల‌‌క్షల‌‌ ప‌‌రిహారం 
  • పాడి ప‌‌శువులు చనిపోతే రూ. 50 వేలు
  • మున్నేరు వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ.10 వేలు
  • ఎన్డీఆర్​ఎఫ్​ తరహాలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు
  • వరద టైమ్​లో బురద రాజకీయాలు మానుకోవాలని బీఆర్​ఎస్​కు హితవు
  • సీఎంఆర్ఎఫ్​కు విరాళాలు ఇవ్వాలని దాతలకు రిక్వెస్ట్​
  • ఖమ్మం, సూర్యాపేట వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం

హైదరాబాద్​/సూర్యాపేట, వెలుగు: వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్​రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిర‌‌మ్మ స్కీం కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు, వ‌‌ర‌‌ద‌‌ల‌‌తో చ‌‌నిపోయిన వారి కుటుంబాల‌‌కు గతంలో ఉన్న రూ.4 ల‌‌క్షల పరిహారాన్ని  5 ల‌‌క్షల‌‌కు పెంచుతున్నామని తెలిపారు. పాడి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శువుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చే ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిహారాన్ని రూ.30 వేల నుంచి 50 వేల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. మేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, గొర్రెల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇస్తున్న పరిహారాన్ని రూ.3 వేల నుంచి 5 వేల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెంచుతున్నట్లు చెప్పారు.

ప్రాథ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిక అంచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాల ప్రకారం ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షన్నర ఎక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుపైగా పంట న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ష్టం వాటిల్లింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అధికారులు సీఎంకు చెప్పగా.. 4 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుపైగా ఎక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల్లో పంట న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ష్టం వాటిల్లిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్లు వార్తలు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తున్నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, వెంటనే రంగంలోకి దిగి ఎన్ని ఎకరాల్లో పంట న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ష్టం జరిగిందో వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాలు సేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రించి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. కామారెడ్డిలో వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్పుడు పంట న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ష్ట ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిహారం వెంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే విడుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చేశామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, ఇప్పుడు కూడా అలాగే ఏర్పాట్లు చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు.

Also Read:-వారంలో మరో అల్పపీడనం

ఆయా వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ బృందాలు కూడా త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మే పంట న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ష్ట ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. భారీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షాలు, నష్టంపై హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాండ్ కంట్రోల్ రూంలో సోమవారం ఉదయం ఉన్నతాధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అనంతరం సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ముంపుబాధితులతో మాట్లాడారు. త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షణ సహాయ చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మం, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూర్యాపేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్రాద్రి కొత్తగూడెం క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెక్టర్లకు రూ. 5 కోట్ల చొప్పున రిలీజ్​చేశారు. 

యువ పోలీసుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఆర్ఎఫ్ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాలో శిక్షణ 

భవిష్యత్తులో ఇలాంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టీజీడీఆర్​ఎఫ్​) ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 8 బెటాలియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్లలో మూడో వంతు యువ పోలీసుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్డీఆర్ఎఫ్ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాలో శిక్షణ ఇవ్వాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని డీజీపీని ఆదేశించారు. ఒక్కో ఫోర్స్ లో ఎనిమిది బృందాలు ఉంటాయని, ఒక్కో బృందంలో వందమంది చొప్పున స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అలాంటి వ్యవస్థ ను ఏర్పాటు చేయాలన్నారు. భారీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షాలు, వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఆర్ఎఫ్ నుంచి త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షణం ఎందుకు అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం లేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం ప్రశ్నించారు. మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నం పెట్టిన ఇండెంట్ ఆధారంగా వాళ్ల ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్గర ఉన్న బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంపుతార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, ఇందుకు స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యం ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డుతుంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అధికారులు బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దులిచ్చారు.

 స్పందించిన సీఎం మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న బెటాలియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్లలోని యువ పోలీసుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఆర్ఎఫ్ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాలో శిక్షణ ఇవ్వాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు. ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యగా ఉంటుంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అధికారులు తెల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా.. ఎంత ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్చయినా ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాలేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, వెంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే కొనుగోలు చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించారు. ఒడిశా, గుజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో అలా శిక్షణ ఇచ్చి బృందాలు ఏర్పాటు చేసుకున్నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అధికారులు తెల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా... అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైతే అక్కడి విధానాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధ్యయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నం చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, అక్కడి అనుభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వం ఉన్నవారితో శిక్షణ ఇప్పించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం సూచించారు.  దానికోసం ఒక మాన్యువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ రూపొందించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, ప్రతి సీజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ ముందు శిక్షణ ఇప్పించిన సిబ్బందితో రిహార్సల్స్ చేయించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు.   25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని సీఎం హెచ్చరించారు. 

అతి తక్కువ సమయంలో భారీ వర్షాలు

అతి త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్కువ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో ఇంత భారీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షాలు కుర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డానికి కార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణాలను అధికారులతో సీఎం రేవంత్​ ఆరా తీశారు. ఊహించిన దానిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నా ఎక్కువ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షాలు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తంలో ఐదేండ్లకో, పదేండ్లో ఇలా వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని.. ఇటీవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చూ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తున్నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, దీనిపై మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రింత అధ్యయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాలు జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుగుతున్నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని వాతావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షాలు ఎక్కువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండే అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశం ఉంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అధికారులు పేర్కొన్నారు.

ఆయా జిల్లాల క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. లోత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టు ప్రాంతాల్లోని ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైతే వెంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క శిబిరాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు. జిల్లా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యవేక్షణ కొన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించారు. చెరువులు, క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్వర్టులు, లోలెవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేలు ఇత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర ప్రదేశాల్లో వివిధ శాఖల అధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యవేక్షణ చేయించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిస్థితులపై ప్రతి మూడు గంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో బులెటిన్ విడుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. 

కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేయాలి

హైదరాబాద్​లో  ఎక్కడా చిన్న అవాంఛ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీయ సంఘ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చోటు చేసుకోవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డానికి కూడా వీల్లేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.  విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తాగు నీరు, సానిటేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాల్లో అప్రమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్తంగా ఉండాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిరంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రం ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యవేక్షించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, విద్యుత్ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యలు ఉంటే వెంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిష్కరించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, లోత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టు ప్రాంతాల ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాయ శిబిరాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించారు.  నిత్యం ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నికి వెళ్లే కూలీలు ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నులు ఉండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క ఇంటి ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్గరే ఉండిపోతార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, వారిని గుర్తించి బియ్యం, ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్పులు, నిత్యావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కులు పంపిణీ చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని  ఆదేశించారు. కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో జరిగిన స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీక్షలో మంత్రులు కోమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టిరెడ్డి వెంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్ రెడ్డి, శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం !

విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా కలిసి కట్టుగా పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిబద్దతో, బాధ్యతాయుతంగా ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు పని చేస్తుండగా.. కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, బురద రాజకీయాలు మానేసి పార్టీలకు అతీతంగా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరం వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా యంత్రాంగంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ .. పదేండ్లు అధికారంలో ఉన్న వాళ్లు గతంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో అందరికీ తెలుసన్నారు.

ఇట్లనే అబద్ధాలు చెప్తే మా వాళ్లు ప్రజలకు నిజాలు చెప్పే సందర్భం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘బెయిల్ కోసం 20 మందితో ఢిల్లీ పోవడానికి సమయం ఉంటుంది కానీ ప్రజలను ఆదుకోవడానికి సమయం ఉండదా?” అని బీఆర్​ఎస్​ నేతలపై ఫైర్​ అయ్యారు.  మూడు రోజులుగా అకాల వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసి పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని.. ఇది బాధాకరమని అన్నారు. అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా సూర్యాపేట జిల్లాలో 21 చెరువులు తెగిపోయాయని, 15 గ్రామాల నుంచి 420 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 20,000 ఎకరాలలో పంట నీట మునిగిందని, 7 పశువులు చనిపోగా, 7 పక్కా ఇండ్లు, 33 కచ్చా ఇండ్లు కూలిపోయాయని, తుంగతుర్తిలో కూడా పశువులు చనిపోయాయని ,చెక్ డ్యాములు తెగిపోయాయని ఆయన తెలిపారు. 

సీఎంఆర్ఎఫ్​కువిరాళాలు ఇవ్వండి

వరదల వల్ల నష్టపోయిన ప్రజల సహాయార్థం సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముందుకు రావడంపై సీఎం రేవంత్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ఎవరైనా సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రస్తుత తరుణంలో ప్రజలకు అండగా నిలబడి, ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, అంతేకాక అధికారులు సైతం పూర్తిస్థాయిలో అండగా ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు.

భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలు కోలుకునేం దుకు అధికారులు ఇంకా బాగా బాధ్యతగా పనిచేయాలని, ప్రజల్లోనే ఉండాలని, ప్రజలను ఆదుకోవాలని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటూ సేవలందిస్తున్న అధికారులకు ఆయన అభినందనలు తెలి యజేశారు. అధికారుల ముందు చూపుతోనే ప్రాణ నష్టం తక్కువగా జరిగిందని అన్నారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన సమీక్ష సమావే శంలో ఎమ్మెల్యేలు పద్మావతి, సామేల్, ఎంపీ రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ టూరిజం డెవల ప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్​ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతా, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

ఊహ వచ్చినప్పటి నుంచి ఇంత వర్షాన్ని, వరదను చూడలేదని మున్నేరు ముంపు ప్రాంతాల్లోని 70, 80 ఏండ్ల వృద్ధులు చెప్తున్నరు. బాధితులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే. వారికి అన్ని విధాలా అండగా ఉంటం. మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి మంత్రివర్గ సహచరులు, అధికారులు చాలా బాగా పనిచేస్తున్నరు. పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కూడా వరద ప్రాంతాల్లో తిరుగుతున్నడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్​ మాత్రం ఫామ్​హౌస్​లో విశ్రాంతి తీసుకుంటున్నడు. ఫ్రెండ్స్​తో కలిసి కేటీఆర్​ అమెరికాలో ఎంజాయ్​ చేస్తూ.. ప్రజాక్షేత్రంలో ఉన్న మంత్రులను, ప్రభుత్వ యంత్రాగాన్ని బద్నాం చేస్తున్నడు.

సీఎం రేవంత్​రెడ్డి